: అమ్మాయిలకు ముద్దు పెట్టి పారిపోయే క్రేజీ సుమిత్ అరెస్ట్


రోడ్డుపై వెళ్తున్న యువతులకు ముద్దు పెట్టి పారిపోయే వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్న క్రేజీ సుమిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుమిత్ ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే, వీడియోలో తాను ముద్దు పెట్టిన అమ్మాయి తన టీమ్ లో మెంబరే అని విచారణలో సుమిత్ తెలిపాడు. అయితే, వీడియోలో ఉన్న యువతుల కోసం తాము వెతుకుతున్నామని... వారి నుంచి ఫిర్యాదులు అందితే స్వీకరిస్తామని పోలీసులు చెప్పారు. అయితే, సుమిత్ చెబుతున్న దాంట్లో నిజమున్నా, లేకపోయినా అతను శిక్షార్హుడే అని పోలీసులు చెప్పారు. అమ్మాయిలకు ముద్దు పెట్టి పారిపోయే వీడియోలను 2015 నుంచి సుమిత్ పోస్ట్ చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News