: మహిళా అభిమాని చిరకాల కోరిక తీర్చిన బాలయ్య... వీడియో వైరల్!


ఓ మహిళా వీరాభిమాని కోరికను తెలుసుకున్న శతచిత్ర యోధుడు బాలకృష్ణ, కూర్చున్న కుర్చీ నుంచి లేచి నిలబడి, ఆమెను ఆహ్వానించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ప్రీమియర్ షో నిన్న హైదరాబాద్ లోని భ్రమరాంబికా థియేటరులో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వీక్షించేందుకు స్వయంగా చిత్ర బృందం వచ్చిన వేళ, ఈ ఘటన జరిగింది.

బాలయ్య థియేటరులోకి ప్రవేశించిన తరువాత, ఓ మహిళ వచ్చి, తాను బాలకృష్ణకు ఎన్నో ఏళ్లుగా అభిమానినని, అతనితో ఫోటో దిగాలని ఎంతో కాలంగా వేచి చూస్తున్నానని, సెక్యూరిటీ గార్డులతో చెప్పింది. వారు వెళ్లి బాలకృష్ణకు విషయం చెప్పడంతో, మహిళలపై తనకున్న గౌరవాన్ని బాలయ్య మరోసారి ప్రదర్శించారు. సినిమా చూసేందుకు అప్పటికే కూర్చున్న ఆయన, లేచి నిలబడి, ఆమెను పిలిచి ఫోటో దిగాడు. కిందనుంచి ఈ తతంగాన్ని వీడియో తీసిన మరో అభిమాని దాన్ని సోషల్ మీడియాలో ఉంచాడు.

  • Loading...

More Telugu News