: పెద్దనోట్ల కష్టాలను అరవై రోజుల్లోనే అధిగమించాం: సీఎం చంద్రబాబు
పెద్దనోట్ల కష్టాలను అరవై రోజుల్లోనే అధిగమించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సెమినార్ లో ఆయన మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థితులపై మధ్యంతర నివేదికను ప్రధాని మోదీకి త్వరలో అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను కూడా త్వరలోనే అందజేస్తామన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల అన్ని రాష్ట్రాలూ ఇంకా ఇబ్బందులు పడుతున్నాయని, ఏపీ మాత్రం ఆ కష్టాలను 60 రోజుల్లోనే అధిగమించిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు అనంతర పరిస్థితులను ఒక సవాల్ గా తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు.