: ఐఫోన్ లా కనిపించే గన్.. మార్కెట్లోకి వస్తోంది!


ఐ-ఫోన్ ని తలపించే విధంగా ఉండే ఓ గన్ వచ్చే వారం అమెరికా మార్కెట్లోకి  రానుంది. ఒక్క బటన్ నొక్కితే చాలు, గన్ గా మారిపోయే దీనిని మినాసొటా ప్రాంతానికి చెందిన ఐడియల్ కన్సీల్ అనే సంస్థ రూపొందించింది. ఐ ఫోన్ లా ఉండే ఈ గన్ మార్కెట్లోకి రాకుండానే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, ఇది నిందితుల చేతికి వెళితే ఇంకేముంది జరగకూడని దారుణాలు జరిగిపోతాయని నిఘా అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, ఈ గన్ యూరోపియన్ మార్కెట్లోకి వెళితే జరిగే పరిస్థితులను ఊహించుకుని భయపడుతున్న వారూ లేకపోలేదు. ఐ ఫోన్ ని పోలిన ఈ గన్  విశేషాలు...

* ఒక్క బటన్ నొక్కితే చాలు, ఐ ఫోన్ లా ఉన్న అది తెరచుకుంటుంది
* ఇది 9 ఎంఎం గన్
* దీని ధన విషయానికొస్తే కేవలం రూ.28 వేల లోపే
* ఈ గన్ కావాలంటూ వచ్చిన ప్రీ ఆర్డర్ల సంఖ్య 12 వేలు

  • Loading...

More Telugu News