: చిరంజీవి కనిపించినప్పుడల్లా అదే విషయం చెబుతాను!: నటి రాధిక
మెగాస్టార్ చిరంజీవి, నటి రాధిక కాంబినేషన్ లో 28 చిత్రాల వరకు వచ్చాయి. ఆ సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్ లే. ఇక, నిన్న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఒక పత్రిక రాధికను ప్రశ్నించగా.. ‘చిరంజీవి కనిపించినప్పుడల్లా, సినిమాలు ఎందుకు వదిలేశారంటూ ఆయన్ని అడుగుతుండేదానిని. సినిమాల్లో మళ్లీ నటిస్తే బాగుంటుందని చెప్పే దానిని. తెలుగు సినీ ఫీల్డ్ కి మీరు కింగ్. కింగ్ ఎప్పుడూ తన సామ్రాజ్యాన్ని వదిలెయ్యకూడదు అని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు, చిరంజీవి సినిమా చేశారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.