: ఈ కారణం వల్లే విజయవాడ అభివృద్ధి కాలేదు: చంద్రబాబు


గన్నవరం ఎయిర్ పోర్ట్ లో నూతన అంతర్జాతీయ టెర్మినల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయలు ప్రారంభించారు. దీనికితోడు, రన్ వే విస్తరణ పనులకు కూడా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గన్నవరం ఎయిర్ పోర్టును రేకుల షెడ్డు దశ నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. నూతన ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు రావాలనేదే తన కోరిక అని చెప్పారు. ఏ పని చేయాలన్నా భూమి కావాలని... భూమి కొరత వల్లే విజయవాడ అభివృద్ధి కాలేదని తెలిపారు. గన్నవరం నుంచి మచిలీపట్నానికి రోడ్డు వేస్తే పోర్టుకు కనెక్టివిటీ వస్తుందని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే వారి చెప్పుడు మాటలను రైతులు వినరాదని... రైతులు భూములు ఇస్తే పోర్టు విస్తరణ పనులను చేపడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News