: భారతీయులు వాడే హెచ్-1బీ, ఎల్1 వర్క్ వీసాలూ కఠినం చేస్తాం: ట్రంప్ అటార్నీ జెఫ్
అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసేవాళ్లు, ముఖ్యంగా భారత ఐటీ నిపుణులు అత్యధికంగా వాడుకునే హెచ్-1బీ, ఎల్1 వర్క్ వీసాల జారీని మరింత కఠినతరం చేస్తామని కాబోయే అధ్యక్షుడు నియమించుకున్న అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ సెనెట్ కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు. ఈ పని చేయడం చాలా సులభమని, ఓ అమెరికన్ చేయదగ్గ ఉద్యోగాన్ని, బయటి దేశాల నుంచి వచ్చిన వ్యక్తి చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. "మనకు కొన్ని హద్దులున్నాయి. మన పౌరుల పట్ల బాధ్యతగా ఉండాల్సి వుంది. మీతో కలసి పని చేయడం నాకు గౌరవం" అని సెనెటర్, జ్యుడీషియరీ కమిటీ చైర్మన్ చార్లెస్ గ్రాసిలీ అడిగిన ప్రశ్నకు జెఫ్ సమాధానాన్ని ఇచ్చారు. ఇక్కడికి ఉద్యోగార్థం వచ్చే విదేశీయులకూ మంచి వేతనాలు లభించేలా తమ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.