: భిలాయిలో రాందేవ్ బాబా యోగా శిబిరం.. లక్షమందికిపైగా హాజరు
చత్తీస్గఢ్లోని భిలాయిలో యోగా గురువు రాందేవ్ బాబా నిర్వహించిన యోగా శిబిరానికి లక్షమందికి పైగా హాజరయ్యారు. పలువురు సెలిబ్రిటీలు సహా పతంజలి ఎండీ, బాబా సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణ శిబిరానికి హాజరై యోగాసనాలు వేశారు. శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఆసనాలు వేశారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చలాకీగా యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగాసనాలను వేయాలని, దానిని దినచర్యగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగాసనాలతో వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా బాబా ప్రదర్శించిన యోగాసనాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.