: బాలయ్యతో కలసి సినిమా చూడాల్సిందేనంటూ థియేటరుకు వచ్చిన రాజమౌళి
తనకెంతో ఇష్టమైన నటులలో బాలకృష్ణ ఒకరని, ఆయన నటించిన ప్రతిష్ఠాత్మక 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఆయనతో కలసి చూడాలని ముందే అనుకున్నానని దర్శక దిగ్గజం రాజమౌళి వ్యాఖ్యానించాడు. ఈ ఉదయం హైదరాబాద్, కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటరులో చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శనకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, సినిమా హిట్ అవుతుందనడంలో తనకు సందేహం లేదని, ఎంత పెద్ద హిట్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నానని అన్నారు. రాజమౌళితో పాటు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, మరో హీరో నారా రోహిత్ తదితరులు అభిమానులతో కలసి ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారు.