: ధోనీ కెప్టెన్ కాదు కాబట్టే యువరాజ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు: యువరాజ్ తండ్రి తీవ్ర వ్యాఖ్యలు


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువరాజ్ సింగ్ టీమిండియాలోకి పునరాగమనంపై స్పందించిన ఆయన, ధోనీ కెప్టెన్ కాకపోవడం వల్లే యువీని జట్టులోకి ఎంపిక చేశారని పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితమే ఇది జరగాల్సి ఉందని, అయితే ఆలస్యంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. కాగా, తాను, ధోనీ స్నేహితులమని పేర్కొంటూ ఒక వీడియోను నిన్న సోషల్ మీడియాలో యువీ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో కూడా తన తండ్రి ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, యువీ మాత్రం తాము స్నేహితులమనే చెప్పాడు. 

  • Loading...

More Telugu News