: కాలుష్య నగరాల్లో అగ్రస్థానంలో ఢిల్లీ!
దేశంలో కాలుష్యం బారిన పడిన 20 నగరాల్లో మన దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. దేశంలో కాలుష్యం బారిన పడిన నగరాల నివేదికను గ్రీన్ పీస్ సంస్థ విడుదల చేసింది. వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా 1.2 మిలియన్ల మంది మరణిస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడించింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. సుమారు మూడు నెలల క్రితం ఢిల్లీలో వాయు కాలుష్యం 42 శాతానికి పెరిగిపోవడం, కాలుష్యంతో కూడిన పొగమంచు నగరాన్ని దుప్పటిలా కప్పేయడంతో ఢిల్లీ వాసులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విష వాయువుల ప్రభావం కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో పాఠశాలలు, కార్యాలయాలకు గతంలో సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.