: 'పద్మాసనం' వెయ్యలేని మోదీ: రాహుల్ గాంధీ చెప్పిన ముచ్చట


ఈ ఉదయం 'జన వేదన సమ్మేళనం'లో పాల్గొని ప్రసంగించిన రాహుల్, ప్రధాని మోదీ 'పద్మాసనం' ముచ్చట చెప్పి వేదికపై ఉన్న కాంగ్రెస్ సీనియర్లను, పార్టీ కార్యకర్తలను నవ్వించారు. యోగాలో పద్మాసనం వేయడం అన్నది తొలి ఆసనంగా గుర్తు చేసిన రాహుల్, మోదీకి పద్మాసనం వేయడం రాదని చమత్కరించారు. ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల కోసమే పని చేయాలని, మోదీకి పద్మాసనంతో పాటు, ప్రజల కోసం పనిచేయడం కూడా తెలియదని అన్నారు. మంచి రోజుల కోసం రెండున్నర ఏళ్లుగా ప్రజలు వేచి చూస్తున్నారని, మరో రెండున్నరేళ్ల తరువాతే మంచి రోజులు వస్తాయని అన్నారు. ఇదే సభలో మరో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ప్రసంగిస్తూ, రాహుల్ వ్యాఖ్యలను గుర్తు చేసి, పద్మాసనం వేయడం రాని మోదీ, నోట్ల రద్దుతో ప్రజలతో శీర్షాసనం వేయించారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News