: పిచ్చి వేషాలు మానుకో: చింతమనేనిపై ప.గో. జిల్లా టీడీపీ నేత అప్పలనాయుడు నిప్పులు


ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని రూ. 40 లక్షలకు కట్టబెట్టేందుకు డీల్ కుదుర్చుకున్న చింతమనేని, ఇప్పుడు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో ఇష్టానుసారం మాట్లాడి వారిని అవమానిస్తున్నారని, తమను దూషిస్తే ఊరుకోబోమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి అప్పలనాయుడు నిప్పులు చెరిగారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్డి అనురాధను ఎంపీపీ పీఠం నుంచి దింపేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని, కొల్లేరు గ్రామాలకు చెందిన ఎంపీటీసీకి అక్రమంగా పదవిని ఇవ్వాలన్న దుర్బుద్ధితో తాము పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక పేరిట ప్రభుత్వ సొమ్ము సంపాదించుకుంటున్న చింతమనేని పైకి మాత్రం తానేమీ వెనకేసుకోలేదని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News