: 'ఖైదీ నంబర్ 150' ఫ్యాన్స్ కు నచ్చేసింది.. తొలి ఆట చూసిన అభిమానుల ఆనందం!
ఈ తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 ఫస్ట్ టాక్ వచ్చేసింది. సినిమా చూసొచ్చిన అభిమానులు ఆనందంతో పరవశించిపోతున్నారు. సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారు. చిరు ఈ సినిమాలో ఎంతో యాక్టివ్‌గా నటించాడని, ఆయన నటనలో జోష్ ఏమాత్రం తగ్గలేదని చెబుతున్నారు. డ్యాన్సుల్లో మునుపటి జోరు చూపించాడని అంటున్నారు. ఖైదీ నంబర్ 150 సినిమా చిరంజీవి గత సినిమాలను గుర్తు చేసిందని పేర్కొన్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో ఎంత అందంగా ఉన్నాడో ఈ సినిమాలోనూ చిరు అంతే అందంగా ఉన్నాడన్నారు. రైతుల కష్టాలే ఇతివృత్తంగా ఈ సినిమా ఉందని, నటన సూపర్ అని అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. తమిళ సినిమాకు రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉందని చెప్పారు.