: దర్శకత్వం చెయ్యగలను...పెద్ద కష్టమైన పని కాదు!: చిరంజీవి
తాను దర్శకత్వం చెయ్యగలనని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, ఇంత సుదీర్ఘ అనుభవం కలిగిన తనకు సినిమాకు దర్శకత్వం వహించడం పెద్ద కష్టమైన పని కాదని అన్నారు. అయితే ఇంత సేఫ్ జోన్ లో ఉన్న తాను సినిమాకు దర్శకత్వం వహించడం అవసరమా? అని ఆగిపోతున్నానని చిరంజీవి తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో 'ఖైదీ నంబర్ 150' సినిమా విడుదలవుతుందని, గల్ప్ లో ఓ కంపెనీకి సెలవు కూడా ఇచ్చారని, అలాగే విమానంలో బ్యానర్లు కట్టి ర్యాలీ చేస్తున్నారని విన్నానని, ఈ పదేళ్లు ఇంత గొప్ప అభిమానులను వదిలి వెళ్లడం బాధగా ఉందని ఆయన చెప్పారు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని ఆయన చెప్పారు. మీ 151వ సినిమా ఏదైవుంటుంది? అంటూ రోజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, 'మళ్లీ.. దుర్మార్గుడు మా వాడే రాంచరణ్ నిర్మిస్తాడు' అంటూ ఆయన నవ్వేశారు. కాగా, ఈ సినిమా రేపు ధియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే చిరంజీవి అభిమానులు ఈ సినిమా చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.