: ఈ చిత్రంలో డైలాగ్స్ అద్భుతం: బాలకృష్ణ


‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రంలో డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ బాగా రాశారని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. తన వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ, దేశం, తెలుగు జాతి, తల్లి గురించి రాసిన డైలాగ్స్ చాలా బాగా ఉన్నాయన్నారు.  ఇకపై తాను నటించే సినిమాల్లో తన పేరు ‘బసవతారక పుత్ర  బాలకృష్ణ’ అని ఉంటుందని, ఈ చిత్రం నుంచి తనలో మరో కోణాన్ని ప్రేక్షకులు చూస్తారని బాలకృష్ణ అన్నారు.
 

  • Loading...

More Telugu News