: భువనగిరిలోని ఫెర్టిలిటీ ఆసుపత్రిపై ఐటీ దాడులు


భువనగిరిలోని డాక్టరు పద్మజ ఫెర్టిలిటీ ఆసుపత్రిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భువనగిరితో పాటు హైదరాబాద్, హబ్సీగూడలోని డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ ఆసుపత్రిపైన, సిబ్బంది నివాసాలపైన ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు జరిపారు. చట్ట విరుద్ధంగా నిర్వహించిన సరోగసి, పలు కాన్పుల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు విలువైన పత్రాలను అధికారులు గుర్తించారు. కాగా, గత రెండేళ్లుగా ఈ ఆసుపత్రులకు చెందిన యాజమాన్యం ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

 

  • Loading...

More Telugu News