: మార్కెట్లోకి త్వరలో రానున్న ‘షియోమి రెడ్ మీ నోట్ 4’


ప్రముఖ సంస్థ షియోమి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 4 త్వరలో మార్కెట్లోకి రానుంది. గోల్డ్, సిల్వర్, గ్రే కలర్స్ లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికొస్తే...1920x1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డెకా కోర్ ప్రాసెసర్, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ, 2.5డి కర్వ్ డ్ గ్లాస్ డిస్ ప్లే,  2 లేదా 3 జీబీ ర్యామ్, 16 లేదా 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News