: తండ్రీకొడుకులిద్దరూ దొరికినకాడికి దోచుకుంటున్నారు: వైసీపీ నేత గౌతంరెడ్డి


అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ లు దొరికినకాడికి దోచుకుంటున్నారని వైసీపీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట్ ల పేరుతో భారీ దోపిడికి తెరతీశారని అన్నారు. సంక్షేమ పథకాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని... గత మూడేళ్ల పాలనలో ఎంతమందికి ఇళ్లు కట్టించారో, ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. జన్మభూమి సభలో పెన్షన్ల కోసం ఎంతోమంది నుంచి దరఖాస్తులు వస్తున్నా... మంజూరు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని కేవలం ప్రైవేట్ ఈవెంట్లకే చంద్రబాబు పరిమితం చేశారని... ప్రజలను గాలికొదిలేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు. 

  • Loading...

More Telugu News