: ఉత్తరాఖండ్ సీఎంకు స్వల్ప అస్వస్థత... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఈ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తన మెడ నొప్పిగా ఉందని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలో ఉత్తరాఖండ్ లో సైతం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతగా, తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఇటీవలి కాలంలో ఆయన అలుపెరగకుండా పర్యటను సాగిస్తూ, నేతలు, ప్రజా ప్రతినిధులతో విశ్రాంతి లేకుండా చర్చలు సాగిస్తుండటమే అస్వస్థతకు కారణమని తెలుస్తోంది. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

  • Loading...

More Telugu News