: కాంగ్రెస్ నాయకుడి కోడి... టీఆర్ఎస్ గుడ్డు పెట్టింది!


కాంగ్రెస్ నాయకుడి కోడి పెట్టిన గుడ్డు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదు శివారు హయత్ నగర్ మండలం రాగన్నగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సామ భీంరెడ్డి తన ఇంటి వద్ద కోడిని పెంచుకుంటున్నారు. ఈ కోడి రెండు గుడ్లు పెట్టింది. అయితే, ఆదివారం నాడు ఆ గుడ్లను ఉడకబెట్టి... గుడ్డు పెంకును తొలగించారు. అంతే.. ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ రెండు గుడ్లలో ఒకటి మాత్రం పూర్తిగా గులాబిరంగులో ఉంది. ఈ రంగు టీఆర్ఎస్ పార్టీకి చెందింది. దీంతో, ఊరివారంతా.... కాంగ్రెస్ నాయకుడి కోడి టీఆర్ఎస్ గుడ్డు పెట్టిందంటూ సరదాగా చెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News