: ఐటీ అధికారులు గుర్తించిన నల్లధనం ఎంతో తెలుసా?
పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ. 5,343.29 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడింది. ఇందులో రూ. 611.48 కోట్ల విలువైన ఆభరణాలు కూడా ఉన్నాయి. జప్తు చేసిన నగదులో రూ. 114.10 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉన్నాయి. మరోవైపు, నవంబర్ 9వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ మధ్యలో ఐటీ చట్టం కింద 1,156 సోదాలు, సర్వేలు, విచారణలను అధికారులు జరిపారు. హవాలా, పన్ను ఎగ్గొట్టడం తదితర ఆరోపణలపై వివిధ సంస్థలకు 5,184 నోటీసులు జారీ చేశారు. సీబీఐ, ఈడీలకు 535 కేసులను ఐటీ అధికారులు సిఫారసు చేశారు. నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని దాచుకునేందుకు కోఆపరేటివ్ బ్యాంకులు బాగా ఉపయోగపడ్డాయని ఐటీ శాఖ తెలిపింది.