: ములాయం సంచలన ప్రకటన.. తమ సీఎం అభ్యర్థిగా అఖిలేష్ పేరు ప్రకటన!


సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ బరిలో ఉంటారని, ఆయన పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ, పార్టీ ముక్కలయ్యే ప్రసక్తే లేదని, పార్టీ ఐక్యత కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నానని, త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, ఈ తాజా ప్రకటనతో సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తెరపడినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News