: పెళ్లి కోసం ప్లాన్... బావామరదళ్ల నాటకం విప్పిన సీసీ పుటేజ్.. బావగారు జైలుకి!


బావామరదళ్లు వేసిన పెళ్లి ప్లాన్ వికటించడంతో, సదరు బావ కటకటాల పాలైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, న్యూఇయర్ రోజున రోడ్డుపై నడిచి వెళ్తుంటే ఒక యవకుడు వచ్చి తనను ముద్దుపెట్టి, గాయపరిచాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ఆమె చెప్పిన వివరాలతో ఆ పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజీ పరిశీలించారు. ఆమె చెప్పింది నిజమేనని గుర్తించారు. దీంతో విచారణ ప్రారంభించారు. అయితే ఆమెతోపాటు వచ్చిన యువకుడి నడక, సీసీ పుటేజ్ లో కనిపించిన యువకుడి నడక ఒకేలా ఉండడం గుర్తించిన పోలీసులు, అతనిని పట్టుకుని తమదైన శైలిలో విచారించారు.

దీంతో తన పేరు ఇర్షాద్ అని, తాను ఆ యువతికి బావనని తెలిపాడు. ఫిర్యాదు చేసిన యువతి తమ ఇంట్లోనే ఉంటుందని వివరించాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, వివాహం చేయమని అడిగితే, తాను సేల్స్ మన్ ని అన్న కారణంతో యువతి తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించడం లేదని తెలిపాడు. దీంతో న్యూఇయర్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలతో స్పూర్తి పొంది, వేధించబడ్డ యువతి అంటే వివాహానికి ఎవరూ ముందుకురారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇక తనతో వివాహం జరిపిస్తారని భావించామని తెలిపాడు. అందుకే వేధింపుల నాటకమాడామని పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించాడు. దీంతో యువతిని ప్రశ్నించిన పోలీసులు, అతను చెప్పింది నిజమని గుర్తించి, అతనిని రిమాండ్ కు పంపారు. బావతో పెళ్లవుతుందని నాటకమాడితే ఇలా వికటించి ప్రియుడ్ని కటకటాల పాలు చేసినందుకు సదరు యువతి ఇప్పుడు బాధపడుతోంది.

  • Loading...

More Telugu News