: జగన్ ప్రతిపక్ష నేత అంటే నమ్మశక్యంగా లేదు: అచ్చెన్నాయుడు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేత అంటే నమ్మశక్యంగా లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టులపై అవగాహనలేని జగన్ విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసింది జగనేనని ఆయన చెప్పారు. జగన్ తో రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని ఆయన జగన్ కు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన కితాబునిచ్చారు.