: విజయవాడలో ‘జన్మభూమి’ రసాభాస !
విజయవాడ మహంతిపురంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాస అయింది. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను సీపీఎం కార్యకర్తలు నిలదీశారు. ఈ క్రమంలో సీపీఎం కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.