: డీఎన్ఏ ఆధారంగా కిమ్ కర్దాషియన్ ను దోచుకున్న దొంగలను పట్టేశారు!
అమెరికన్ టీవీ నటి కిమ్ కర్ధాషియన్ ను దోచుకున్న దొంగలను ఫ్రెంచ్ పోలీసులు పట్టేశారు. గత అక్టోబర్ లో ఫ్రాన్స్ లోని లగ్జరీ హోటల్ లో బస చేసిన కిమ్ కర్దాషియన్ ను ఇద్దరు దొంగలు బంధించి, తుపాకీతో బెదిరించి దోచుకున్న సంగతి తెలసిందే. ఈ దోపిడీలో ఆమె 10.5 మిలియన్ డాలర్ల (71 కోట్ల రూపాయల) విలువైన నగలను దోచుకెళ్లిపోయారంటూ ఆమె ఫ్రెంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ సేకరించిన ఆధారాలలోని డీఎన్ఏ ఆధారంగా దోపిడీ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.