: ఇంటిని అద్దెకిచ్చి ఎనిమిదేళ్లుగా ఎయిర్ పోర్టులో మకాం!


సౌకర్యవంతమైన జీవితం కోసం 8 ఏళ్లుగా సింగపూర్ ఎయిర్ పోర్టులో మకాం వేసిన మహిళను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...2008లో వచ్చిన సంక్షోభంలో సింగపూర్ కి చెందిన ఓ మహిళ ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె, తన ఇంటిని అద్దెకి ఇచ్చి, తద్వారా లభించే ఆదాయంతో జీవించాలని నిర్ణయించుకుంది. దీంతో వెంటనే ఆమె ప్రపంచ ప్రసిద్ధి పొందిన సింగపూర్ చాంగీ ఎయిర్ పోర్టుకు మకాం మార్చింది.

తనకు వచ్చే అద్దెతో అక్కడి రెస్టారెంట్లలో భోజనం చేస్తూ, రెస్ట్ రూముల్లో నిద్రిస్తూ 8 ఏళ్లు వెళ్లబుచ్చింది. ఈ మధ్యే ఆమెను సెక్యూరిటీ గార్డులు గుర్తించారు. మొదట్లో ఆమె అక్కడి నుంచి మకాం మార్చాలని భావించింది. దీంతో అక్కడున్న సౌకర్యాలను చూసిన ఆమె తరువాత వెళ్లలేకపోయింది. దీంతో ఆమెను వారు అదుపులోకి తీసుకుని, సాంఘిక, కుటుంబాభివృద్ధి మంత్రిత్వ శాఖకు అప్పగించారు. తన ఇంటిని అమ్మేసి, చిన్న ఇంటికి మకాం మార్చాలని ఆమె భావిస్తోంది. 

  • Loading...

More Telugu News