: విశాఖవాసుల ఆకాంక్ష నెరవేరుతుంది: వెంకయ్యనాయుడు
విశాఖవాసుల రైల్వే జోన్ ఆకాంక్ష నెరవేరుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖపట్టణంలోని సీజీహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ-చెన్నై కారిడార్ త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని అన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషిని ఆయన విశాఖ వాసులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేక ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.