: నైటీలో వచ్చిపోయే భార్య ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త... తీరాచూస్తే స్నేహితుడే!


అక్రమ సంబంధాల కేసులు బయటపడటం సర్వ సాధారణమే అయినా, ఈ కేసు కాస్త విచిత్రమైనది. ఓ సినిమా స్టోరీని తలపిస్తోంది. పుణె సమీపంలోని బిదేవాడి సమీపంలో జరిగింది. తన భార్యతో సంబంధం పెట్టుకుని నైటీ వేసుకుని, చున్నీతో ముఖం కప్పుకుని వచ్చి, నిద్రిస్తున్న తనకు క్లోరోఫాం వేసిన హ్యండ్ కర్చీఫ్ వాసన చూపించి పని ముగించుకు వెళుతుండే ఓ ప్రబుద్ధుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడో వ్యక్తి. తీరా చూస్తే అతనెవరో కాదు. స్నేహితుడే!

బాధితుడి ఫిర్యాదు మేరకు ఖడక్ పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, శుక్రవార్ పేట్ లో ఉంటూ, వంట పాత్రల వ్యాపారం చేసుకునే ఓ కుటుంబానికి 44 ఏళ్ల రాజేష్ గిషూలాల్ మెహతా స్నేహితుడు. వీరి ఇంటికి మెహతా వచ్చి పోతూ ఉంటాడు కూడా. ఇటీవలి కాలంలో తాను లేని సమయంలో మెహతా వచ్చి వెళుతున్నాడని అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డు చెప్పడంతో, తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు కూడా.

ఆపై మెహతా డ్రామా మొదలైంది. తానెవరో తెలియకుండా ఉండేందుకు, అమ్మాయిలా కనిపించేందుకు ఓ గౌన్, దుప్పట్టా ధరించి రాకపోకలు సాగించడం ప్రారంభించాడు. రాత్రి పూట క్లోరోఫాం పూసిన కర్చీఫ్ తో తన ప్రియురాలి భర్తకు స్పృహ లేకుండా చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఉదయం అల్పాహారం తరువాత బాధితుడు రెస్ట్ తీసుకోవాలని భావించి పడుకుండి పోయాడు. 11 గంటల సమయంలో భార్య నుంచి ప్రియుడికి కబురు వెళ్లింది. ఎప్పటిలానే అమ్మాయిలా దుస్తులు ధరించి వచ్చిన మెహతా, ఆమె భర్త నిద్రిస్తున్నాడని భావించి, మత్తుమందు వాసన చూపేందుకు దగ్గరికి వచ్చాడు.

ఉలిక్కిపడి లేచిన బాధితుడు తొలుత దోపిడీ కోసం దొంగలు వచ్చారని భావించి, మీరెవరు? ఏం కావాలి? ఎందుకు వచ్చావు? అని ప్రశ్నించాడు. దీంతో బిత్తరపోయిన మెహతా, అతనిపై దాడికి దిగాడు. ఆపై ఎదురుదాడికి దిగిన బాధితుడు మెహతాను నిలువరించడానికి ప్రయతించడంతో, తప్పించుకునేందుకు మెహతా మరో బెడ్ రూములోకి పరుగెత్తి లోపలి నుంచి తలుపు వేసుకున్నాడు. అతను ఎవరన్న ప్రశ్నకు తన భార్య నుంచి తెలియదన్న సమాధానం వచ్చింది. ఈలోగా తలుపు తీసుకుని బయటకు వచ్చిన అతను పరుగు లంఘించుకున్నాడు. నైటీలోనే పారిపోతున్న అతన్ని చూసిన బాధితుడు, వచ్చింది మెహతానేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో శనివారం నాడు మెహతాను అరెస్ట్ చేశామని, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, అతన్నుంచి క్లోరోఫాం, చినిగిన గౌను తదితరాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News