: సైకిల్ పై మీరే తేల్చుకోండి... తండ్రీ, కొడుకులకు ఈసీ ఫైనల్ వార్నింగ్!


ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేష్ ల మధ్య సైకిల్ గుర్తుపై పోరు తుది దశకు చేరుకుంది. పార్టీని తాను స్థాపించాను కాబట్టి, సైకిల్ గుర్తు తనకే చెందుతుందని ములాయం సింగ్ ఎలక్షన్ కమిషన్ ఎదుట వాదించారు. ఈ ఉదయం ఈసీని కలిసిన ఆయన, గుర్తు తమకే దక్కాలని కోరారు. ఈ విషయంలో అత్యధిక పార్టీ ప్రజా ప్రతినిధులు అఖిలేష్ వెంట ఉన్నారని పేర్కొన్న ఈసీ, ఎన్నికల గుర్తుపై మీరే తేల్చుకుని ఓ నిర్ణయానికి రావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు నేటి సాయంత్రం వరకూ సమయమిస్తున్నామని, ఓ నిర్ణయానికి రాకుంటే, నిబంధనల ప్రకారం తాము వ్యవహరిస్తామని ఈసీ వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, ములాయం తరువాత, అఖిలేష్ సైతం నేడు ఈసీ అధికారులను మరోసారి కలవనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News