: బాలయ్య బాబు కత్తి పట్టినా..మీసం పెంచినా..పంచె కట్టినా అందమే!: రామ్- లక్ష్మణ్
బాలయ్య బాబు కత్తి పట్టినా.. మీసం పెంచినా.. పంచె కట్టినా అందమేనని ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ అన్నారు. విశాఖపట్టణంలోని నిర్వహిస్తున్న ‘శాతకర్ణి’ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రామ్- లక్ష్మణ్ మాట్లాడుతూ, సింహా, లెజెండ్ చిత్రాలను మించి, ఒక రేంజ్ లో ఉండే చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అని, ఈ చిత్రంలో ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయని, సాహసోపేతమైన ఫైట్స్ ఉండేలా చూడాలని బాలయ్యబాబు చెబుతుండేవారని అన్నారు. ఈ చిత్రంలో ఫైట్స్ కోసం విదేశీ ఫైట్ మాస్టర్లను కూడా సంప్రదించి కొన్ని విషయాలను తెలుసుకున్నామని, బాలయ్య బాబు వందో చిత్రంలో ఫైట్ మాస్టర్స్ గా తమకు అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.