: విమానంలో అతి చేస్తే ఇక బేడీలే: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం


దేశవాళీ విమానాల్లో అతి చేసే వారిని కట్టడి చేసేందుకు ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో గొడవ చేస్తూ, వేధింపులకు పాల్పడే వారికి బేడీలు వేసి కూర్చోబెట్టాలని, వారు కిందకు దిగగానే పోలీసులకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని దేశవాళీ సర్వీసుల్లో ప్లాస్టిక్ బేడీలను సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపింది. తమ ప్రవర్తనతో పక్కవారికి విసుగు కలిగించే వారికి విమాన సిబ్బంది తొలుత చెప్పి చూస్తారని, వినని పక్షంగా బేడీలు వేస్తారని సంస్థ చైర్మన్ అశ్వని లోహాని వెల్లడించారు.

ఇప్పటివరకూ అంతర్జాతీయ విమాన సర్వీసుల్లోనే బేడీలను ఉంచేవాళ్లమని, ఇప్పుడు దేశవాళీ సర్వీసుల్లోనూ ఉంచుతామని తెలిపారు. ప్రయాణికులతో పాటు విమానంలోని ఉద్యోగుల భద్రత కూడా తమకు ముఖ్యమని ఆయన అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో విమానాల్లో అతి చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మస్కట్ - ఢిల్లీ విమానంలో ఎయిర్ హోస్టెస్ ను ఓ వ్యక్తి వేధించగా, ముంబై - నెవార్క్ విమానంలో సహ ప్రయాణికుడితో గొడవ పడ్డాడో వ్యక్తి. ఈ తరహా కేసుల్లో ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని లోహానీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News