: మరో మూడేళ్లలో 'కార్డు'లకు ప్రాధాన్యం బాగా తగ్గిపోతుంది!: నీతి ఆయోగ్ సీఈఓ
2020 నాటికి దేశంలో ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాల వినియోగం గణనీయంగా తగ్గుతుందని, కార్డులు అప్రాధాన్యంగా మారుతాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. ప్రవాసీ భారతీయ దివస్ పేరిట జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నోట్లరద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నందున, అన్ని రకాల డెబిట్, క్రెడిట్ కార్డులు, ఏటీఎం, పీవోఎస్ యంత్రాలు పూర్తిగా అసంబద్ధమవుతాయన్నది తన అభిప్రాయమని చెప్పారు. బ్యాంకు ఖాతాదారులు తమ వేలి ముద్రను ఉపయోగిస్తూ, కేవలం 30 సెకన్లలో లావాదేవీలను పూర్తి చేయనున్నారని, అందువల్ల మిగతా అన్ని రకాల నగదు చెల్లింపుల వ్యవస్థకు కాలం చెల్లుతుందని ఆయన అన్నారు.