: మన ముందున్నది ఇండియా... జాగ్రత్త: హెచ్చరించిన స్టీవ్ స్మిత్
త్వరలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా క్రికెట్ బృందానికి ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ హెచ్చరికలు జారీ చేశాడు. పాక్ పై టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, అత్యంత ప్రమాదకర ఇండియాతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. భారత ఉపఖండంలోని పిచ్ లు ఆస్ట్రేలియాలో మాదిరి ఉండవని, సాధ్యమైనంత త్వరగా అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలని, లేకుంటే కష్టాలు తప్పవని చెప్పాడు. 2004 తరువాత ఇండియాలో ఒక్క టెస్టును కూడా గెలవలేకపోయామని గుర్తు చేస్తూ, ఆ చెత్త రికార్డు చెరిగిపోవాలని అన్నాడు. కొత్త కుర్రాళ్లు మాథ్యూ, పీటర్ లు బాగా ఆడుతున్నప్పటికీ, వారికి భారత పిచ్ లపై అనుభవం లేకపోవడంతో, క్లిష్టకాలం ముందున్నట్టేనని, ఇండియాపై ఇండియాలో గెలవాలంటే సర్వశక్తులూ ఒడ్డాలని, తేలికగా తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు.