: మీరేం కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉన్నాయి: దర్శకుడు వినాయక్
అన్నయ్య చిరంజీవి ఒక మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. హాయ్ లాండ్ లో జరిగిన ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, తన తండ్రి తరువాత పెద్దన్నయ్య రూపంలో తన తప్పులు సరిదిద్దినందుకు ఆయనకు ధన్యవాదాలని అన్నారు. అన్నయ్య సినిమా నుంచి ఏం కోరుకుంటారో... అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని, అభిమానులందర్నీ ఈ సినిమా అలరిస్తుందని ఆయన చెప్పారు. సినిమా సూపర్ హిట్ అని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని ఆయన చెప్పారు.