: కరీంనగర్‌లో సర్పంచ్‌ను చితకబాదిన కానిస్టేబుల్.. బ్రెయిన్‌డెడ్.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
రెండు రోజుల క్రితం ఏటీఎం వద్ద కరీంనగర్ జిల్లా కోహెడ్ మండలం సముద్రాల సర్పంచ్ రవికి, కానిస్టేబుల్‌కు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో రెచ్చిపోయిన కానిస్టేబుల్ రవిని చితకబాదాడు. ఈ క్రమంలో తీవ్రగాయాల పాలైన రవి జిల్లా కేంద్రంలోని రీచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. దీంతో అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో రవి అవయవాలను సేకరించేందుకు హైదరాబాద్ నుంచి ఓ బృందం రీచ్ ఆస్పత్రికి చేరుకుంది. విషయం తెలిసిన పోలీసులు వైద్య బృందాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం బయటపడుతుందనే వైద్యులను పోలీసులు అడ్డుకుంటున్నారని రవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.