: టీఆర్ఎస్ కార్పొరేటర్ హేమలతకు జరిమానా!


జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బన్సీలాల్ పేట టీఆర్ఎస్ కార్పొరేటర్ హేమలత జరిమానాకు గురయ్యారు. బన్సీలాల్ పేటలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ ఆమె తన పేరిట బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీంతో, జీహెచ్ఎంసీ ఆమెకు పదివేల రూపాయల జరిమానాను విధించింది. కాగా, జనవరి ఒకటో తేదీ నుంచి పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.

 


  • Loading...

More Telugu News