: ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం కావాలి: సీఎం చంద్రబాబు


మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆటలాడాలని, ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.   శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జీఎంఆర్ (గ్రంథి మల్లికార్జునరావు) పుట్టిన ఊరును మరిచిపోకుండా అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని, తద్వారా అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు.  మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు కష్టం అనిపించదని, ఆరోగ్యంగా ఉంటామని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకూదని.. సరైన పరిష్కారం కనుగొనాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు.









  • Loading...

More Telugu News