: 'విశాఖ' ప్రత్యేక రైల్వేజోన్ కోసం పోరాటం


ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ విశాఖలో సమైక్యాంధ్ర రాజకీయ ఐక్య వేదిక ఈ ఉదయం ఆందోళన చేపట్టింది. ఇందుకు  నిరసనగా  ఆందోళనకారులు నగరంలోని జగదాంబ కూడలిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే దిష్టిబొమ్మను దహనం చేశారు. కొన్నేళ్లుగా విశాఖకు ప్రత్యేక  రైల్వేజోన్ కావాలని నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఐక్య వేదిక రాష్ట్ర నేత జెటి రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖకు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా ఎలాంటి హామీలు ఇవ్వటంలేదని, ఇందుకోసం పోరాడుతున్న తమపై కేసులు పెట్టి భాధిస్తున్నారని
ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలు ఎదురైనా విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ వచ్చేంతవరకు పోరాడతామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News