: నక్క, మొసలి చర్మాలపై కేంద్రం కీలక నిర్ణయం!
వివిధ జంతువులు, పాముల చర్మాలతో బెల్టులు, హ్యాండ్ బ్యాగ్స్, ఉన్ని దుస్తులు, షూస్ తదితర వస్తువులను తయారు చేస్తుంటారు. వీటికోసం నక్క, మొసలి చర్మాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వీటికి సంబంధించి భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్ వస్తువుల కోసం జంతువులను యథేచ్చగా చంపేస్తున్నారన్న కారణంగా... నక్క తోలు, మొసలి చర్మాల దిగుమతిపై నిషేధం విధించింది.
నక్కతోలుతో తయారయ్యే ఉన్ని దుస్తులకు, మొసలి చర్మంతో తయారయ్యే షూస్, బెల్టులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో, విచ్చలవిడిగా జంతువులను చంపేసి, వాటితో వస్తువులను తయారు చేస్తుండటాన్ని నిరసిస్తూ... దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కేంద్ర మంత్రి మేనకాగాంధీ కూడా ఆందోళనకారులకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే, వీటి దిగుమతులపై కేంద్ర నిషేధం విధించింది.