: మీరు కృష్ణుడిగా మారిపోయారు...!: లాలూ కుమారుడిపై జోక్ వేసిన ప్రధాని మోదీ!


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పై ప్రధాని మోదీ జోకేసి అందరినీ నవ్వించారు. గత నెలలో కృష్ణ జన్మస్థలంగా భావించే మధురలో పర్యటించిన తేజ్ ప్రతాప్, ఓ ఫ్లూట్ ను పట్టుకుని దిగిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీన్నే మోదీ ప్రస్తావిస్తూ, "మీరు భగవాన్ కృష్ణుడిగా మారారు" అంటూ హాస్యమాడారు. పాట్నాలో పర్యటిస్తూ, భారీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన తరువాత, పూర్తి శాకాహార వంటకాలతో కూడిన ప్రత్యేక విందును బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏర్పాటు చేయగా, మోదీ సహా లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు, పలువురు రాష్ట్ర మంత్రులు దీనికి హాజరయ్యారు. ఈ విందులో అటు లాలూ, ఇటు నితీశ్ ల మధ్య ఉన్న మోదీ, తేజ్ ప్రతాప్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యతో అక్కడున్న అందరిలో నవ్వులు విరిశాయి.

  • Loading...

More Telugu News