: పరిశోధనలకు పైసా ఇవ్వరు కానీ.. నోబెల్ తెస్తే రూ.వంద కోట్లు ఇస్తారట.. చంద్రబాబు ప్రకటనపై ఇక్రిశాట్ డైరెక్టర్ రుసరుస!
నోబెల్ బహుమతి కొల్లగొడితే అక్షరాలా వందకోట్ల రూపాయలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్రిశాట్ రీసెర్చ్ ప్రోగ్రాం డైరెక్టర్ రాజీవ్ కుమార్ వర్షీనియా మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటన సరికాదని అన్నారు. పరిశోధనలకు పైసా ఇవ్వని ప్రభుత్వాలు నోబెల్ బహుమతి సాధిస్తే కోట్లాది రూపాయలు ఇస్తామనడంలో అర్థం లేదన్నారు. నోబెల్ సాధించాలంటే అందుకు తగిన పరిశోధనలకు అవకాశాలు ఉండాలని అన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో తొలుత మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అవిలేకుండా నోబెల్ బహుమతి సాధించాలనుకోవడం సబబు కాదని విమర్శించారు.