: స్మార్ట్‌ఫోన్ రూ.2 వేలకే అందుబాటులోకి రావాలి.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మనసులో మాట
డిజిటల్ సేవలు మరింత విస్తృతం కావాలంటే స్మార్ట్‌ఫోన్‌ను రూ.2 వేలకే అందించాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన గురువారం తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్న సభలో మాట్లాడారు. డిజిటల్ ప్రపంచంతో ప్రజలను మమేకం చేసేందుకు స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత తగ్గించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.2 వేలు (30 డాలర్లు) ఉంటే మేలని అన్నారు. డిజిటల్ సేవలు మరింత మంది ప్రజలకు చేరడానికి ఇదొక్కటే మార్గమని సుందర్ పిచాయ్ అన్నారు.