: మోదీ కన్ను ఇప్పుడు మహిళల నగలపై పడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.. శరద్ పవార్
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధాని నరేంద్రమోదీ కన్ను ఇప్పుడు మహిళలు ధరించే బంగారు ఆభరణాలపై పడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అన్నారు. మోదీ మాటల మాంత్రికుడని పేర్కొన్న ఆయన పరిస్థితులు తనకు అనుకూలంగా లేకున్నా, అనుకూలంగా మార్చుకుంటారని ప్రశంసించారు. ఆయన తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంటారని, తమకు ఏదో జరుగుతుందన్న భావనను ప్రజలలో కల్పించడంలో ఆయన దిట్ట అని పేర్కొన్నారు. 50 రోజుల్లో నోట్ల రద్దు సమస్యను పరిష్కరించకుంటే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని మోదీ అన్నారని, ఇప్పుడు శిక్ష ఎదుర్కొనేందుకు మోదీ చౌరస్తాను ఎంచుకోవాలని పవార్ డిమాండ్ చేశారు.