: మైనర్ భార్యతో శృంగారం నేరమా? కాదా?.. ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంను ఆశ్రయించిన కైలాశ్ సత్యార్థి
మైనర్ భార్యతో శృంగారం నేరం కాదని ఓపక్క ఐపీసీలోని 375 సెక్షన్ చెబుతుండగా.. మైనర్లతో బలవంతపు శృంగారం తీవ్రమైన నేరమని మరోపక్క 'లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ' (పోక్సో) చట్టం చెబుతోందని, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను సరిదిద్దాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. నోబెల్ బహుమతి గ్రహీత, బచ్పన్ బచావ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కైలాశ్ సత్యార్థి వేసిన పిల్‌తో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది.
ఈ విషయమై నాలుగు నెలల్లో తన వాదనను వినిపించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడి ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కాగా వివాహానికి నిరాకరించిన మాజీ ప్రియుడిపై ఓ మహిళా ప్రొఫెసర్ పెట్టిన రేప్ కేసును కొట్టేసిన బాంబే హైకోర్టు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని తేల్చి చెప్పింది.