: 12 నుంచి విజయవాడలో విమానయాన సదస్సు, ఎయిర్ షో!
విజయవాడలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు విమానయాన సదస్సు, ఎయిర్ షో నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, పౌర విమానయాన శాఖ, ఏపీ ప్రభుత్వం, ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సును సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారన్నారు. జనవరి 12న విజయవాడ రన్ వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. రూ.130 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభిస్తామని అన్నారు. దేశీయ, విదేశీ విమానయాన సంస్థల ప్రతినిధులు 200 మంది హాజరుకానున్న ఈ సదస్సులో రీజినల్ కనెక్టివిటీపై చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్ డమ్ ఎయిర్ షో నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.