: కమిషన్ల కోసం చంద్రబాబు, యనమల ప్లాన్ వేశారు: అంబటి రాంబాబు
ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరుతుండటాన్ని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పుబట్టారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచితే మరిన్ని అప్పులు తెచ్చి, కమిషన్లు నొక్కేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి ప్లాన్ అని ఆయన విమర్శించారు. ఎఫ్ఆర్బీఎం పెంచాలన్న ప్రభుత్వ డిమాండ్ ను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో 20 శాతం రెవెన్యూ పెరిగితే జీడీపీ 7.2 శాతం ఉందని... ఇక్కడ రెవెన్యూ ఏమాత్రం పెరగకపోయినా జీడీపీ 12.23 శాతం ఉన్నట్టు చెబుతున్నారని, ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు... తనవల్లే వచ్చిందని చంద్రబాబు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.