: పీఎంవో ఎదుట తృణ‌మూల్ నేత‌ల ఆందోళ‌న.. అరెస్టు


రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో త‌మ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన నేప‌థ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఈ రోజు న్యూఢిల్లీలోని పీఎంవో ఎదుట‌ ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌మ‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌ని వారు ఆరోపించారు. మోదీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. తృణ‌మూల్ నేత‌లు ఆందోళ‌న‌ను విర‌మించ‌క‌పోవ‌డంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌స్టేష‌న్‌కి త‌ర‌లించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News