: బొట్టు పెట్టుకోలేదని ఆరోపిస్తూ, 20 మంది వచ్చి మీదపడ్డారు... శివాజీ కోటలో అకృత్యంపై యువతి


పుణె సమీపంలోని శివాజీ కోటలో ట్రెక్కింగ్ కు వెళ్లిన యువతీ యువకులపై స్థానిక యువకులు జరిపిన దాడిపై బాధిత యువతి మీడియా ముందుకు వచ్చింది. ఆ రోజున జరిగిన దాడి గురించిన సమాచారాన్ని పంచుకుంది. "మేము 10 మంది మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోటకు వెళ్లాము. సాయంత్రం 7 గంటల సమయంలో క్యాంప్ ఫైర్ వేసుకున్న సమయంలో కోట వద్దకు శివాజీ భక్తులమని చెప్పుకుంటున్న 20 మంది 'ఫోర్డ్ లవర్స్' బ్యాచ్ అక్కడికి వచ్చింది. వాళ్లు మమల్ని నిర్బంధించారు. మేము మద్యం తాగకపోయినా, మద్యం తాగుతున్నామని ఆరోపించారు. నేను బొట్టు పెట్టుకోలేదని ఆరోపిస్తూ, నాపై దాడికి దిగారు.

నేను హిందువునేనని చెబుతున్నా వినిపించుకోలేదు. రక్తం వచ్చేట్టు కొట్టారు. వేధించారు. తాకరాని చోట తాకారు. వ్యభిచారులమని ఆరోపించారు. మా గ్రూప్ లోని మిగతా అమ్మాయిలదీ ఇదే పరిస్థితి. నిబంధనలకు అనుగుణంగానే మేము వచ్చామని చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు. దాదాపు ఐదు గంటల పాటు మమ్మల్ని నిర్బంధించారు. మాతోపాటు ఉన్న స్నేహితుల బట్టలు ఊడదీసి విచక్షణా రహితంగా కొట్టారు.

'శివాజీ మహరాజ్ కీ జై' అంటూనే ఈ దారుణానికి ఒడిగట్టారు. మమ్మల్ని తీసుకెళ్లిన ఆర్గనైజర్ పై మరింతగా దాడి చేశారు. నా భర్త, ఆయన స్నేహితులు పర్వతారోహణపై శిక్షణ తీసుకుంటున్నారు. ఆయనతో పాటు నేనూ ఉన్నాను. మా వెంట ఐదేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. చివరికి సమీపంలోని గ్రామస్థులు, పోలీసులు వచ్చిన తరువాతనే మాకు విముక్తి కలిగింది. స్టేషన్ కు తీసుకెళ్లి మాకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేశారు. ఆపై పోలీసులు సైతం ఫిర్యాదు చేయవద్దని ఒత్తిడి చేశారు" అని సదరు యువతి మీడియా ముందు వాపోయింది.

  • Loading...

More Telugu News